ప్రతీ ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:06 PM
ప్రతీ ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని భగవాన్ సత్యసాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామమూర్తి అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో శ్రీశివ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసా రు.
లక్షెట్టిపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని భగవాన్ సత్యసాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామమూర్తి అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో శ్రీశివ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసా రు. ఈసందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జయంతి సందర్భంగా దాతల సహా యంతో సుమారు 26మందికి కుట్టు మిషన్లు అందజేసారు. నిరుపేదలకు 50 మందికి దుప్పట్లను అందించారు. ప్రతీ ఒక్కరూ సేవా భావాలను పెపొందించుకోవాలని సేవ చేయడంలో తృప్తి ఉం టుందని సేవ చేయడానికి వయస్సుతో పని లేదని మంచి మనస్సు ఉంటేచాలన్నారు. ఈకార్యక్ర మంలో సీనియర్ న్యాయవాది కేవీ ప్రతాప్, వైశ్య సంఘం నాయకుడు కొత్త వెంకటేశ్వర్లు, ఐఖ్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, పట్టణ పురోహితులు వినోద్ శర్మ, సంస్థ సభ్యులు మాదంశెట్టి సతీష్, మనోహర్, సుమతి, పాటిబండ్ల ప్రసన్న, గఫూర్, పల్లెర్ల మనోహర్, జైన శ్రీని వాస్, గుండ శేఖర్, రామకోటిరెడ్డి, సాంబశివరావు, సుస్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.