ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:30 PM
ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎస్సీ వెల్ఫర్ డిప్యూటీ డైరెక్టర్ చాతారజు దుర్గా ప్రసాద్ విధ్యార్థులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన అకస్మికంగా పరిశీలించారు.
డిప్యూటి డైరెక్టర్ చాతరాజు దుర్గాప్రసాద్
లక్షెట్టిపేట, నవంబరు, 16(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎస్సీ వెల్ఫర్ డిప్యూటీ డైరెక్టర్ చాతారజు దుర్గా ప్రసాద్ విధ్యార్థులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన అకస్మికంగా పరిశీలించారు. వసతిగృహ పరిసరాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. విధ్యార్థులతో మాట్లాడుతూ హస్టల్‌ల్లో రోజు అందిస్తున్న మినూపై ఆరా తీసారు. అంతే కాకుండా ఆదివారం స్పెషల్ డే సందర్భంగా విధ్యార్థులతో కలిసి అల్పాహారం చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్యార్థులు చలి కాసం సందర్భగాఆ జాగ్రత్తగా ఉండాలన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా శ్రద్దగా చదువుకోవాలని వార్డెన్ విధ్యార్థుల పరీక్షల సందర్భంగా ప్రత్యేకంగా ఒక రికార్డు మెంటన్ చేస్తూ వాళ్లకు పరీక్షల్లో వచ్చిన మార్కులను అందులో నమోదు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో హెచ్‌డబ్లువో రాజు ఉన్నారు.