ప్రతీ డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:39 PM
వాహన డ్రైవర్లు ప్రతీ ఒక్కరూ ట్రా ఫిక్ రూల్స్ పాటించాలని ఏసీపీ ప్రకాష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో లక్షెట్టిపేట పోలీసుల ఆధర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.
మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
లక్షెట్టిపేట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వాహన డ్రైవర్లు ప్రతీ ఒక్కరూ ట్రా ఫిక్ రూల్స్ పాటించాలని ఏసీపీ ప్రకాష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో లక్షెట్టిపేట పోలీసుల ఆధర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడు పకూడదని వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలను వాహనం వెంట ఉంచుకోవాలన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు తమ విధులను అంకిత బావంతో చేయాలని స్కూల్ పిల్లల జీవితాలు తమ చేతుల్లో ఉన్నాయన్న విషయం గమనించాలన్నారు. అనంతరం బాధ్యతగా విధులు నిర్వహిస్తు న్న ఆటో డ్రైవర్ రాజును ఏసీపీ శాలువాతో సన్మానించారు. ఈకార్యక్ర మం లో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, ఎస్సై-2రామయ్య, దండేపల్లి ఎస్సై తహాసీయోద్దీన్‌తో పాటు పోలీసు సిబ్బంది, 200 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.