ప్రతీ దరఖాస్తు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:30 PM
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వ చ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చే యాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారు లను ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
తెలకపల్లి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వ చ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చే యాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం మండలంలో ని రాకొండ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు లను కలెక్టర్ పరిశీలించారు. 20వ తేదీ వరకు జరుగుతాయని, ప్రజలు దరఖాస్తులను సమ ర్పించవచ్చునని వెల్లడించారు.
ఫ తెలకపల్లిలోని ఉన్నత పాఠశాలలో విద్యా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రొఫెసర్ జ యశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీ లించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయా లని తల్లిదండ్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట పరీక్షల నిర్వ హణ అధికారి రాజశేఖర్ రా వు, తెలకపల్లి ఎంఈవో శ్రీని వాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాకొండలో
రేషన్ దుకాణం తనిఖీ
తెలకపల్లి మండలం రా కొండ గ్రామంలోని 15వ నెంబరు చౌక ధరల దకాణాన్ని కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చౌక ధరల దుకాణాన్ని పరిశీలించి స న్నబియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. చౌక ధరల దుకాణాల ద్వారా వినియోగదారుల కు సకాలంలో సన్నబి య్యాన్ని పారదర్శకంగా అందించాలని అన్నారు.
30 వరకు రేషన్ పంపిణీ : కలెక్టర్
నాగర్‌కర్నూల్ : జిల్లాలోని రేషన్‌కార్డుదారు లు తమ రేషన్ తీసుకునేం దుకు గడువు జూన్ 30వరకు పొడిగించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ పేర్కొన్నారు.