kumaram bheem asifabad- అదను దాటుతున్నా.. అందని యూరియా
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:10 PM
రైతులు యూరియా సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. పత్తి, వరి పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు దాటుతున్నా..జిల్లాలోని రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. అదను దాటితే దిగుబడి వస్తుందో రాదోనని రైతులు ఆందోళన చెందతున్నారు.
- అధికారుల తీరుపై మండలాల్లో అన్నదాతల నిరసనలు
- ప్రభుత్వం సరిపడా అందజేయాలని డిమాండ్
చింతలమానేపల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతులు యూరియా సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. పత్తి, వరి పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు దాటుతున్నా..జిల్లాలోని రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. అదను దాటితే దిగుబడి వస్తుందో రాదోనని రైతులు ఆందోళన చెందతున్నారు. యూరియా కోసం రైతులు తెల్లవారే సరికి యూరి యా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. నెల రోజులుగా యూరియా దొరకకపో వడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజా ప్రతినిధులు యూరియా కోసం పట్టించుకోవడం లేదని, అధికార యంత్రాంగం రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమ య్యారని రైతులు చెబుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొంత మంది రైతులు తమ చేన్లల్లో, పొల్లాల్లో యూరియాకు బదులు ప్రత్యమ్నాయంగా ఇతర ఎరువులను వినియోగిస్తున్నారు.
- 4.5 లక్షల ఎకరాల్లో పంటలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1.23 లక్షల మంది రైతులు ఉండగా 4.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో 3,35,363 ఎకరాలు పత్తి పంట, 56,861 ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. 30,430 ఎకరాల్లో కంది, 1000 ఎకరాల్లో మొక్కజొన్న, 1500 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఏి్లాలో ఆఠిస్టు నెల వరకు 42,062 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా, ఎఫ్‌పీఓలు, ఏఆర్‌ఎస్‌కే సంఘాలు 71తో పాటు ప్రైవేటు ఎరువులు, ఫర్టిలైజర్ షాపులు 380 వరకు ఉన్నాయి. వీటి ద్వారా యూరి యా విక్రయిస్తున్నారు. జిల్లాలో గత ఖరీఫ్ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 42,062,289 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. ప్రస్తుత సీజన్లో అదే సమయంలో 36వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ప్రస్తుతం 260 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా వాటిని సరఫరా చేస్తున్నారు. అయితే సీజన్ మొ త్తంలో ఎకరాకు రెండు బస్తాల యూరియా నాలుగు దఫాల్లో వాడాల్సి ఉండగా రైతులు మాత్రం రెట్టింపు వాడుతుండడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఎకరాకు ఒక బస్తా రూ. 266 చొప్పున విక్రయిస్తు న్నారు. చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. కానీ యూరియా కోసం పడిగాపులు కాస్తుండడంతో ఇదే అదునుగా కొందరు దళారులు బస్తాకు రూ. 600 - 800 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను రైతులకు కట్టబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక కౌలు రైతుల పరిస్థితి మరిం త అధ్వానంగా మారింది. ప్రభుత్వం సరిపడా యూ రియా అందజేయాలని రైతులు కోరుతున్నారు.
రెండు బస్తాలు మాత్రమే..
- రమేశ్ కుకడ్కర్, రైతు, బాలాజీఅనుకోడ
ఒక్కో రైతుకు రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది రైతులకు ఏ మాత్రం సరిపోదు. భూమి ఎక్కువగా ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందజేయాలి. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం 2 బస్తాల యూరియా మా త్రమే పంపిణీ చేస్తే యూరియా కోసం ఎన్ని రోజులు తిరగాలి. పూర్తిగా ఒకే సారి పంపిణీ చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవు.
యూరియా పంపిణీలో విఫలం..
- జూమిడి సాగర్, రైతు, డబ్బా
రైతాంగానికి సరిపడా యూరియా పంపిణీలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ప్రజా ప్రతినిధులు పట్టించుకొని రైతాంగానికి పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేసేలా కృషి చేయాలి. యూరియా ఆలస్యం కావడం వల్ల పంటల దిగుబ డిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా రైతులందరికీ పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.