kumaram bheem asifabad- చెత్తకూ ఉందో.. లెక్క
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:22 PM
స్వచ్ఛ సర్వేక్షణ్ దిశగా జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఇక నుంచి చెత్తకు ఏరివేతకు జియోట్యాగింగ్ చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నారు. వ్యాపార సముదాయాలకు ఒక్కొక్క దుకాణానికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ద్వారా ఇక నుంచి చెత్త ఎత్తేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏ దుకాణం నుంచి చెత్త ఎంత మేర రానుందన్న ఇక పక్కాగా లెక్కలు తేలనుంది. ఈ ప్రక్రియతో ఎంత మేర వ్యాపార సముదాల నుంచి చెత్త బయటికి వస్తోందని ఇట్టే తేలనుంది.
- క్యూఆర్ కోడ్‌తో కూడిన నంబరు కేటాయింపునకు చర్యలు కాగజ్‌నగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్ దిశగా జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఇక నుంచి చెత్తకు ఏరివేతకు జియోట్యాగింగ్ చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నారు. వ్యాపార సముదాయాలకు ఒక్కొక్క దుకాణానికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ద్వారా ఇక నుంచి చెత్త ఎత్తేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఏ దుకాణం నుంచి చెత్త ఎంత మేర రానుందన్న ఇక పక్కాగా లెక్కలు తేలనుంది. ఈ ప్రక్రియతో ఎంత మేర వ్యాపార సముదాల నుంచి చెత్త బయటికి వస్తోందని ఇట్టే తేలనుంది. మున్సిపల్ అధికారులు ఈ మేరకు పక్కాగా లెక్కలు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ లెక్కలు తేలితే ఎంత మేర రుసుము విధించి మున్సిపాలిటీలకు అదనపు ఆదాయం రాబట్టే విధానానికి శ్రీకారం చుడుతున్నారు.
రెండు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి, కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 1,188 వ్యాపార సముదాయాలున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 1,188 ట్రేడ్ లైసెన్సుకలిగి ఉన్నారు. ప్రస్తుతం చెత్త ఏరివేతకు వాహనాల ద్వారా తీస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో చెత్త ఉండ కుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మార్కెట్‌లో ప్రధాన రోడ్లపై చెత్తను ఎత్తివేస్తున్నారు. అలాగే వ్యాపార సముదాయాలుండే ప్రాంతాల్లో ప్రతి దుకాణానికి జియో టాగింగ్ చేపట్టనున్నారు. ప్రయివేటు సంస్థలు, సూపర్ మార్కెట్‌లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయాలకు పక్కాగా జియో ట్యాగింగ్ చేయనున్నారు. మరో నెలరోజుల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఏయే దుకణానికి ఎంత మేర చెత్త వస్తోందన్న అనే లెక్కలు పక్కాగా తేలనున్నాయి. స్వచ్చ మున్సిపాల్టీ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను ఏటా విడుదల చేస్తోంది. స్వచ్చ మున్సిపాల్టీ స్కీంలో ప్రధానంగా మురికి కాల్వల నిర్మాణం, చెత్త రహిత మున్సిపాల్టీల ఏర్పాటు, ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈ స్కీం ఉద్దేశ్యం. అయితే దేశంలోని అన్ని మున్సిపాల్టీల్లో ఈ ప్రక్రియను చేపట్టాలన్న ఉద్దేశ్యంతో ఏటా రూ. కోటి రూపాయిల నిధులను విడుదల చేస్తోంది. ఏటా కేంద్ర ప్రభుత్వం అన్నీ మున్సిపాల్టీలకు ర్యాంకును కూడా విడుదల చేస్తోంది. ఈ ఏడాది కాగజ్‌నగర్ మున్సిపాల్టీకి 7,534 స్కోరు లభించింది. ఇంటింటా చెత్త సేకరణలో కూడా 43 శాతం, చెత్త విభజనలో ఆరు శాతం, చెత్త ప్రాసెసింగ్‌లో 88 శాతం, మార్కెట్‌లో శుభ్రత 80 శాతం అమలు చేస్తున్నట్టు తేలింది. చెత్తతో ఆదాయం తెచ్చుకునేందుకు మరో ప్రక్రియకు శ్రీకారం చుడుతుడంటం విశేషం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను వివరణ కోరగా వ్యాపార సముదాయాల నుంచి తీసుకెళ్లే చెత్తకు జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే వ్యాపార దుకాణానికి క్యూఆర్ కోడ్‌ను అంజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏ వ్యాపార దుకాణం నుంచి చెత్త ఎంత వస్తోందని లెక్కలు తేల్చాకే రుసుము విధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈప్రక్రియ మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.