Share News

kumaram bheem asifabad- కోట్లు వెచ్చించినా తప్పని తిప్పలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:48 PM

కుమరం భీం జిల్లాలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలు ఇంకా అసంపూర్తి దశ వీడడం లేదు. సిర్పూరు(టి) మండలం వేంపల్లి సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) పనులు ఇంకా పూర్తి కావడం లేదు. రూ.30 కోట్లతో 2016లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ అసంపూర్తిగాను ఉన్నాయి.

kumaram bheem asifabad- కోట్లు వెచ్చించినా తప్పని తిప్పలు
మెట్ల నిర్మాణం లేని కాగజ్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి

- పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలు ఇంకా అసంపూర్తి దశ వీడడం లేదు. సిర్పూరు(టి) మండలం వేంపల్లి సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) పనులు ఇంకా పూర్తి కావడం లేదు. రూ.30 కోట్లతో 2016లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ అసంపూర్తిగాను ఉన్నాయి. వంతెన నిర్మాణ పూర్తి అయినా వంతెనకు ఇరువైపులా రోడ్డు పనులు పూర్తి చేయక పోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు వాహనాలు ఈ మార్గంలో నడుస్తుండగా, కంకర తేలిన రోడ్డుపై దుమ్ముతో ప్రయాణం నరక యాతనగా మారింది. ద్విచక్ర వాహనాలు నడుపడం సాహసకృత్యంగా ఉందని వాపోతున్నారు. ఒక వైపుకంకర తేలిపోతూ, మరో వైపు దుమ్ము దూసుక పోతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది. గ్రామస్థులు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు పరిష్కార లభించలేదు. భక్తులు, విద్యార్థులు రోజు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారు.

- టోంకినికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు..

ఇటీవల కాగజ్‌నగర్‌ నుంచి టోంకినికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద అసంపూర్తిగా ఉన్న కంకర రోడ్డుపై నడువలేని పరిస్థితి ఏర్పడింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వంతెన పనులు పూర్తి కాక పోవడం అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో 2012లో రూ.25 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. కాని మెట్ల నిర్మాణం కాలేదు. సంజీవయ్య కాలనీ, సీ బాబు కాలనీ, కాపువాడ, ప్రజలు రోజు అవస్థలు పడుతున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణానికి సమీపంగా 500 అడుగులు దూరంలో ఉండే ఈ కాలనీలు ప్రస్తుతం కాగజ్‌నగర్‌కు రావాలంటే వంతెనపై నుంచి 2 కిలోమీటర్లు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికులు, ప్రజా ప్రతినిధులు అనేక మార్లు రైల్వే అధికారులకు వినతి పత్రాలు సమరిపంచినప్పటికి ఫలితం లేక పోయిది. రైల్వే జీఎం పర్యటనలో కూడా ఈ సమస్య వివరించారు. ఇంత వరకు పురగతి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

అధికారులకు పట్టింపే లేదు..

- గోలేం వెంకటేష్‌, కాగజ్‌నగర్‌

అధికారులకు పనుల పూర్తిపై పట్టింపే లేదు. సిర్పూరు(టి), కాగజ్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. సిర్పూరు(టి) రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి రోడ్డు నిర్మించాల్సి ఉంది. తాత్కాలికంగా కంకర రోడ్డు వేశారు. నడువలేని పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనాల వారు ఎప్పుడు పడిపోయే పరిస్థితి ఉందో తెలియదు. కాగజ్‌నగర్‌లో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి మెట్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో సమీప కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Nov 09 , 2025 | 10:48 PM