Share News

Road Pit Remains Unrepaired: ఇంత జరిగినా గుంత పూడ్చలే

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:43 AM

రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది...

Road Pit Remains Unrepaired: ఇంత జరిగినా గుంత పూడ్చలే

చేవెళ్ల/ మెయినాబాద్‌ నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్‌ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్‌తో పూడ్చారు. కానీ సాయంత్రం వచ్చిన వర్షానికి డస్ట్‌ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి 10గంటల సమయంలో ఈ గుంత మళ్లీ ఇలా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.

Updated Date - Nov 05 , 2025 | 03:43 AM