ఎన్నికలు బహిష్కరించినా స్పందించరా..?
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:15 PM
డిండి - నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చార కొండ మండలంలోని గో కారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటి ఫికేషన్‌ను రద్దు చేయా లని ఎర్రవల్లి గ్రామస్థులు స్థానిక సర్పంచ్ ఎన్నికలను మూకుమ్మడిగా బ హిష్కరించినా ప్రభుత్వానికి చలనంలేదా అని ఎస్సీ, ఎస్టీకమిషన్ మాజీ సభ్యుడు, ఎల్‌హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నా యక్ అన్నారు.
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్
చారకొండ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి) : డిండి - నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చార కొండ మండలంలోని గో కారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటి ఫికేషన్‌ను రద్దు చేయా లని ఎర్రవల్లి గ్రామస్థులు స్థానిక సర్పంచ్ ఎన్నికలను మూకుమ్మడిగా బ హిష్కరించినా ప్రభుత్వానికి చలనంలేదా అని ఎస్సీ, ఎస్టీకమిషన్ మాజీ సభ్యుడు, ఎల్‌హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నా యక్ అన్నారు. ఎర్రవల్లిలో అంబేడ్కర్ చౌరస్తా లో భూ నిర్వాసితులు, గ్రామస్థులు చేపట్టిన రి లే నిరాహార దీక్షలు శనివారం 19వ రోజుకు చే రాయి. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో దీక్షకు సం ఘీభావం తెలిపారు. రాంబాల్‌నాయక్ మాట్లా డుతూ గోకారంరిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిం చి ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు దశరథం నాయక్, జిల్లా అధ్యక్షు డు దేవిలాల్‌చౌహాన్, నాయకులు జుమ్లానాయ క్, సాయికుమార్‌నాయక్, ఎర్రవల్లి జేఏసీ అధ్య క్షుడు నాగయ్యనాయక్, ప్రకాశ్, పర్వతాలు, పె ద్దయ్య, రాజు, రాంపాల్, రెడ్యా నాయక్, నిర్వాసి తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.