రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:15 AM
రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే ప్రభుత్వం వరిధా న్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లె, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి గ్రామాలలో
ఇల్లంతకుంట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే ప్రభుత్వం వరిధా న్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లె, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి గ్రామాలలో సోమవారం ఫ్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ. 2,389, సాధారణ రకానికి రూ2.369 మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్స్‌చైర్మన్ రొండ్ల తిరుపతిరెడ్డి, ఏపీఎం లతామంగేశ్వరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఫ్యాక్స్‌చైర్మెన్ ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు పసుల వెంకటి, సంజీవ్, మామిడి రాజు, అంతగిరి, తీగల పుష్పలత, గొడుగు తిరుపతి, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, రజనీకాంత్, వెంకటరెడ్డి, రాజేశం, వీరేశం, జ్యోతి, సురేందర్‌రెడ్డి, తిరుపతి, హరికుమార్, మల్లేశంలతో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మండల పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 71మందికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. కార్యక్రమంలో నేరెళ్ల విజయ్, భాస్కర్‌రెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.