Share News

EPFO Faces Criticism for Delays: అధిక పింఛనుపై కేంద్రం ఆదేశాలు బేఖాతర్‌!

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:24 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో).. చందాదారులకు అధిక పింఛను విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందా? పీఎఫ్‌ అధిక పింఛనుపై.....

EPFO Faces Criticism for Delays: అధిక పింఛనుపై కేంద్రం ఆదేశాలు బేఖాతర్‌!

  • సుప్రీం తీర్పునూ పట్టించుకోని ఈపీఎ్‌ఫవో

  • కేంద్ర కార్మిక శాఖ లేఖతో వెలుగులోకి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వాకం

న్యూఢిల్లీ, నవంబరు 30: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో).. చందాదారులకు అధిక పింఛను విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందా? పీఎఫ్‌ అధిక పింఛనుపై కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసిందా? సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోలేదా? అంటే ఈపీఎ్‌ఫవోకు కేంద్ర కార్మిక శాఖ రాసిన లేఖ అవుననే చెబుతోంది. 2023 మే 31న కేంద్ర కార్మిక శాఖ రాసిన లేఖతో ఈ విషయం వెల్లడైంది. అధిక పింఛనుకు సంబంధించిన ఉద్యోగులు, యాజమాన్యాల చెల్లింపుల ప్రక్రియను అడ్డుకునేలా ఈపీఎ్‌ఫవోనే అడ్డంకులు సృష్టించుకుందని సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌కు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి ఒకరు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందు, వారి 60 నెలల సగటు వేతనాన్ని ఆధారంగా చేసుకొని అధిక పింఛన్‌ను లెక్కించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని కూడా గుర్తుచేశారు. ‘‘అధిక పింఛనుకు సంబంధించి ఈపీఎ్‌ఫవో స్వయంగా రూపొందించిన నమూనాలతోనే సమస్య అని స్పష్టమవుతోంది. 1. అధిక పింఛనుకు చెల్లింపుల కోసం ఉద్యోగులు/యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడం. 2. దానికి ఈపీఎ్‌ఫవో అనుమతి ఇవ్వడానికి సంబంధించి సంస్థ వివరణ ఇవ్వలేదు. అలాగే అధిక పింఛను కోసం చెల్లింపులు చేసుకోవడానికి ఈపీఎ్‌ఫవో కార్యాలయాలు వారికి ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు’’ అని లేఖ గుర్తుచేసింది. ఈపీఎ్‌ఫవో నిర్వహణా లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఈపీఎ్‌ఫవో తాను చేసిన తప్పులనే ప్రస్తుతం ఆధారంగా చేసుకొని అధిక పింఛను చెల్లింపులకు అర్హత లేదంటూ నిరాకరిస్తోందని ఆరోపించింది.

సుప్రీం ఆదేశాలనూ పక్కన పెట్టింది..

పీఎఫ్‌ చందాదారుల్లో అర్హులకు అధిక పింఛను ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు 2022, నవంబరు 4న తీర్పు ఇచ్చింది. కానీ, అధిక పింఛను కోసం మే 2023 వరకు ఈపీఎ్‌ఫవోకు 15.9 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో ఒక్కరిని కూడా సంస్థ అర్హులుగా పేర్కొనలేదని కేంద్రం లేఖలో గుర్తుచేసింది. మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను, ఇటు సుప్రీంకోర్టు తీర్పునూ ఈపీఎ్‌ఫవో పట్టించుకోలేదని స్పష్టం చేసింది.

Updated Date - Dec 01 , 2025 | 05:24 AM