ప్రజల ఆహార భద్రతకు భరోసా
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:21 PM
ఆహార భద్ర తకు భరోసా ఇవ్వడానికి రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం మం జూరు చేసిందని జడ్చర్ల ఎమ్మె ల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అ న్నారు.
- రేషన్‌కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఊర్కొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఆహార భద్ర తకు భరోసా ఇవ్వడానికి రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం మం జూరు చేసిందని జడ్చర్ల ఎమ్మె ల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అ న్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వ హించిన రేషన్‌కార్డుల పంపిణీలో పాల్గొని మా ట్లాడారు. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదని, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్య త్‌కు ఆర్థిక బలం అని పేర్కొన్నారు. పదేళ్ల బీ ఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్‌కార్డు మం జూరు చేయలేదని విమర్శించారు. అంతకు ముందు మండలంలోని ఊర్కొండపేట అభ యాంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్ యూసుఫ్ అలీ, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్‌రెడ్డి, అధ్యక్షు డు వెంకటయ్యగౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, రమేష్‌నాయక్, అబ్దుల్ సమి, శ్యామ్ సుందర్ రెడ్డి, పర్వత్‌రెడ్డి, శ్రీనివాస్, మనోహర్‌రెడ్డి, ఆయూబ్‌పాషా, ఆరిఫ్, రవి, జంగయ్య, మధురెడ్డి ఉన్నారు.