Share News

మీ పిల్లలను మా బడిలో చేర్పించండి

ABN , Publish Date - May 26 , 2025 | 12:00 AM

‘మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి’ అంటూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని గోవిందాపురంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నా రు.

మీ పిల్లలను మా బడిలో చేర్పించండి
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న గోవిందాపురం పాఠశాల ఉపాధ్యాయులు

ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారం

హుజూర్‌నగర్‌ , మే 25(ఆంధ్రజ్యోతి): ‘మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి’ అంటూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని గోవిందాపురంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నా రు. హెచ్‌ఎం గొట్టె శ్రీనివాసు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి కార్యక్రమాలు చేపడుతున్నారు. బడిబాట కార్యక్రమమే కాకుండా చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యకు బదులు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని తల్లిదండ్రులను ఒప్పి స్తున్నారు. పట్టణంలోని గోవిందాపురంలోని 8, 9వ వార్డులలో సుమారు 1500 కుటుంబాలుఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. కాగా మూడు సంవత్సరాల నుంచి 2023-24 లో 19 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికయ్యారు. 2024-25లో నలుగురు విద్యార్థులు, 2025-26 విద్యా సంవత్సరంలో ఆరుగురు విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించారు. గురుకులాకు పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికీ సీటు వచ్చిందని హెచ్‌ఎం తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి 1 నుంచి 4వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో 4వ తరగతి విద్యార్థులందరూ ప్రతిభా పాటవాలు కనబరుస్తున్నారు.

గురుకుల ఫలితాలు చూడండి.. మా బడిలో చేర్పించండి

‘గురుకుల ఫలితాలు చూడండి.. మా ప్రభుత్వ బడిలో మీ పిల్లలను చేర్పించండి అంటూ ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయ వర్గాన్ని గోవిందాపురానికి చెందిన సీఐ బొల్లెద్దు సురేష్‌, ఎస్‌ఐలు చిలకబత్తిని ధనుంజయ్‌, పాలడుగు రాకేష్‌, ధనుంజయ్‌, మాజీ కౌన్సిలర్‌ సౌజన్య, మాజీ ఎంపీటీసీ ఇట్టిమళ్ళ జ్యోతిశ్రీనివాసు అభినందించారు.

Updated Date - May 26 , 2025 | 12:00 AM