Share News

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ వాతావరణం కల్పించాలి

ABN , Publish Date - May 10 , 2025 | 11:59 PM

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ వాతావరణం కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

 ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ వాతావరణం కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ వాతావరణం కల్పించాలి

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నల్లగొండ టౌన, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ వాతావరణం కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో టీఎస్‌ యూటీఎఫ్‌, తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కమ్యూనికేషన ఇంగ్లీష్‌ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం ప్రారంభించారు. కానీ పా ఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పరిస్థితులు కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారని తెలిపారు. దీనిని అధిగమించటానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన, తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హెచఎంలు, ఉపాధ్యాయులు ఆంగ్లంలో సులభంగా మాట్లాడడం, బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమా న్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీఎ స్‌ యూటీఎఫ్‌ జిల్లా కమిటీని అభినందించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ బోధకులు బి.కె.రెడ్డి మా ట్లాడుతూ యంఎ్‌ససీ (మైండ్‌ టాక్‌, సెల్ప్‌టాక్‌, క్రాస్‌ టాక్‌) ప ద్ధతి ద్వారా ఇంగ్లీష్‌ భాషలో సులభంగా మాట్లాడవచ్చని అన్నా రు. భాషను మైండ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఇంగ్లీష్‌ భాషపై పట్టు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కా ర్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు పాల్వాయి అంజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్ల సైదులు, కార్యదర్శులు గేర నర్సింహ, రమాదేవి, నలపరా జు వెంకన్న, మధుసూదన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:59 PM