Minister Kishan Reddy: వికసిత భారత్‌కు ఇంధన భద్రత కీలకం
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:42 AM
బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, ఖనిజ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక....
వాటిని సాధించేందుకు కేంద్రం అంకితభావంతో ఉంది: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, ఖనిజ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం, ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇంధన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరత రెండు స్తంభాల్లాంటివని, వీటిని సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. ఇంధనఽభద్రతకు సంబంధించి భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ అవసరం భారీగా పెరగనుందని, ముఖ్యంగా లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరాలు 2040 నాటికి భారీగా పెరగనున్నాయన్నారు. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా మన దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.