Share News

సీపీఎస్‌ అంతం పీఆర్‌టీయూ టీఎస్‌ పంతం

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:23 PM

ప్రభుత్వ ఉద్యో గుల, ఉపాధ్యాయుల పట్ల శా పంగా మారిన సీపీఎస్‌ విధా నం రద్దుఅయ్యేంత వరకు పీ ఆర్‌ టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని ఆ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.

సీపీఎస్‌ అంతం పీఆర్‌టీయూ టీఎస్‌ పంతం
వాల్‌పోస్టర్‌ విడుదల చేస్తున్న పీటీఆర్‌ఎస్‌టీఎస్‌ నాయకులు

- పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచందర్‌ రావు

కొల్లాపూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యో గుల, ఉపాధ్యాయుల పట్ల శా పంగా మారిన సీపీఎస్‌ విధా నం రద్దుఅయ్యేంత వరకు పీ ఆర్‌ టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని ఆ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. మంగళవారం మం డల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్‌టీ యూటీఎస్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ విధానం అం తం కోరుతూ చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్య క్రమం వాల్‌పోస్టర్లను ఉపాధ్యాయులతో కలిసి ఆయన విడుదల చేశారు. సెప్టెంబరు 1న పెన్ష న్‌ విద్రోహ దినంగా పేర్కొంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి నాయకత్వంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్వహిస్తున్న చలో హైదరాబా ద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో రారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌, చంద్రారెడ్డి, ఈశ్వరయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఫ నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : ఉపాధ్యాయ, ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబరు 1న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యా య జేఏసీ చైర్మన్‌, పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దొడ్ల సత్యనారాయణరెడ్డి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రా గణంలో చలో హైదరాబాద్‌ పోస్టర్‌ను ఆవిష్క రించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల జే ఏసీ జిల్లా అధ్యక్షుడు భవాండ్ల వెంకటేష్‌, ఉద్యో గ జేఏసీ జిల్లా కార్యదర్శి పి.రాజేఖర్‌రావు, పీ ఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా కార్యదర్శి తుమ్మల సు రేందర్‌రెడ్డి, బిచ్చానాయక్‌, రాంచందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:23 PM