Share News

kumaram bheem asifabad- కూరగాయల సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:06 PM

కూరగాయలు సాగు చేసే రైతులను మరింత ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద ఒక ఎకరా సాగు చేసే రైతుకు రూ.9,600రాయితీ రూపంలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉద్యానవన శాఖ ఒక ఎకరాలో కూరగాయలు సాగు చేస్తే 6టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు, సస్యరక్షణ చర్యలతో పాటు యాజమాన్య పద్దతుల కింద ఎకరాకు రూ.24వేలు ఖర్చు అవుతుందని లెక్కించిం

kumaram bheem asifabad- కూరగాయల సాగుకు ప్రోత్సాహం
బెజ్జూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయలు

దిగుమతి భారం తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం

- అవగాహన కల్పిస్తే అన్నదాతలకు మేలు

బెజ్జూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కూరగాయలు సాగు చేసే రైతులను మరింత ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద ఒక ఎకరా సాగు చేసే రైతుకు రూ.9,600రాయితీ రూపంలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉద్యానవన శాఖ ఒక ఎకరాలో కూరగాయలు సాగు చేస్తే 6టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు, సస్యరక్షణ చర్యలతో పాటు యాజమాన్య పద్దతుల కింద ఎకరాకు రూ.24వేలు ఖర్చు అవుతుందని లెక్కించింది. ఈ క్రమంలో 40శాతం రాయితీ ఉత్పత్తిదారుల ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించింది. టమాట, బెండ, దొండ, కాకర, చిక్కు డు, పచ్చి మిరప, క్యాబేజీ, క్యాలీప్లవర్‌, క్యాప్సికం, సోరకాయ తదితర తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులు సంబంధిత ఉద్యాన శాఖాధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రాయితీకి ఎంపిక చేస్తారు. రెండున్నర ఎకరాల వరకు రాయితీ అందించనున్నారు. సాగు ప్రారం భించి గుర్తింపు పొందిన నర్సరీలు లేదా ఉద్యాన వన శాఖ నుంచి నారు లేదా విత్తనాలు కొనుగోలు చేస్తే వెంటనే నిధులు జమ చేస్తారు. ఈ నిర్ణయం సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ మూలంగా రాబోయే రోజుల్లో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగి కొరత తీరే అవకాశం ఉంది.

జిల్లాలో 7,800ఎకరాల్లో సాగు..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్లను కలుపుకొని 7,800ఎకరాల్లో వివిద కూర గాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 6,200మంది రైతులు కూరగాయలు సాగు చేస్తూ జీవనం పొందుతున్నా రు. జిల్లాలో పెద్దగా జలవనరులు లేక ప్రభుత్వ ప్రోత్సాహం లేని కారణంగా సాగుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో అధికంగా స్థానిక అవసరాల మేరకే కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు అర, ఒక ఎకరం భూమిలో మాత్రమే సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ భూముల్లో సాగునీటి వనరులు లేక, ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎక్కువగా కేవలం కాగజ్‌నగర్‌ పరిసర ప్రాంతా ల్లోని నజ్రూల్‌నగర్‌ ఏరియాలో మాత్రమే కూరగా యల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మిగితా ప్రాంతాల్లో తక్కువ సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిస్తున్న కూరగాయలను ఇక్కడ సరైన మార్కెట్‌ సౌకర్యం లేని కారణంగా మంచిర్యాల, బెల్లంపల్లి, పక్కన ఉన్న మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అదే ఇక్కడ రైతుబజార్‌ లాంటి సదుపాయం ఉన్నట్లయితే రైతులు ఇక్కడే అమ్ము కునే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు అనువైన వసతులు లేక ఎక్కువగా వాణిజ్య పంట ల వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.

- సాగు పెరిగే అవకాశం..

రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న రైతులను ప్రోత్సహించేందుకు కూరగాయల సాగుకు రాయి తీలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో జనాభాకు సరిపడా కూరగాయలు పెంచాలనే అక్ష్యంతో రైతులను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే జిల్లాలో ఎంత మేర సాగు అవుతుంది. ఇంకా ఎంత అవ సరమో అన్నదానిపై అధికారులు లెక్కలు వేశారు. జిల్లాలో మరో ఇరవై వేల ఎకరాల్లో సాగు చేసిన ట్లయితే కూరగాయల కొరత ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులకు మేలు జరగడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి పరిచి స్థానిక అవస రాలు తీర్చే అవకాశం కూడా ఉంటుంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కూరగాయల సాగు చాలా తక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమమతిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో కూరగాయల సాగు పెంచి రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రకటనలకే పరిమితం కావద్దు..

- నికాడి తిరుపతి, రైతు, ఎల్కపల్లి

గతంలో ఇలాగే రాయితీ ఇస్తామనడంతో వివిద రకాల కూరగాయల సాగు చేపట్టాం. ఇంత వరకు రాయితీ రూపేణా నయా పైసా కూడా అందలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా ప్రకటనలకే పరిమితం చేయవద్దు. జిల్లాలో మార్కె టింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తే పండించిన కూరగాయలు విక్రయించేందుకు అనుకూలంగా ఉంటుంది.

రైతులకు అవగాహన కల్పిస్తాం..

- అబ్దుల్‌ నదీం, జిల్లా ఉద్యానవన అధికారి

జిల్లాలో కూరగాయల అవసరం ఎంతో ఉంది. పొరుగు జిల్లాల నుంచి అవసరమైన కూరగా యలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం కూరగాయలు పండించే రైతు లకు రాయితీలు ఇచ్చేందుకు నిర్నయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తాం. రాయి తీలు ఇవ్వడం వల్ల సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Nov 15 , 2025 | 11:06 PM