kumaram bheem asifabad- సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:27 PM
ప్రజలకు ఉద్యోగులు చేసిన సేవలతోనే గుర్తింపు ఉంటుందని ఎఫ్‌డీపీటీ సీసీఎఫ్ శాంతారాం అన్నారు. ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన దేవదాస్‌కు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి సీఈఆర్ క్లబ్‌లోని అటవీశాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
రెబ్బెన, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉద్యోగులు చేసిన సేవలతోనే గుర్తింపు ఉంటుందని ఎఫ్‌డీపీటీ సీసీఎఫ్ శాంతారాం అన్నారు. ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన దేవదాస్‌కు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి సీఈఆర్ క్లబ్‌లోని అటవీశాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ సుశాంత్‌సుఖదేవ్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ పరిపాలనాధికారి వెంకటకృష్ణ, అటవీ రేంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో పరీక్షల సహాయ కమిషనర్ ఉదయబాబు పదవీ విరమణ పొందడంతో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో పీఆర్టీయూ నాయ కులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీనివాసరావు, అనీల్‌కుమార్, నరసింహచారి, ప్రకాష్, రాకేష్, రవిశంకర్, సోనేరావు, రవి తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్‌రావు, మహగాం స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆత్రం రాంబాయిలు అన్నారు. మహగాం బాలికల ఆశ్రమోన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం మహగాం స్కూల్ కాంప్లెల్స్ పరిధిలోని కల్లురుగూడ పాఠశాల ఉపాధ్యాయుడు కోడప్పా శ్యాంరావు పదవీ విరమణ సందర్భంగా ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఏసీఆర్సీ మండాడీ గగ్రు, ఉపాధ్యాయులు గెడం జగ్జీవన్,కోట్నాక పాండురంగ్,కుమ్ర భీంరావు,తార,ఆత్రం ప్రభు,కోవ నారాయణ, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్రం ఆనంద్‌రావు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఉద్యోగులు తమ జీవన విధానంతో ఇతరులకు ఆదర్శంగా నిలువాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయం ఆవరణలో పదవీ విరమణ పొందిన సర్వే అధికారి ఎంటీవీ స్వామిని అధికారులతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, నరేందర్, అధికారులు కృష్ణమూర్తి, ఆఫ్సర్‌పాషా, శ్రీనివాస్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ప్రధానో పాధ్యాయుడు సదాశివ్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు షాహిబ్‌హుస్సేన్ పదవీ విరమణ పొందడంతో ఆయనను ఉపాధ్యా యులతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మజారుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.