Share News

IFMIS portal: వివరాలు అప్‌లోడ్‌ చేస్తేనే వేతనం!

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:20 AM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌..

IFMIS portal: వివరాలు అప్‌లోడ్‌ చేస్తేనే వేతనం!

  • ఉద్యోగుల వివరాలు ఈ నెల 25 వరకు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి

  • లేదంటే అక్టోబరు నెల వేతనాలు రావు.. అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు

  • 10,15,512 మందికిగాను ఇప్పటిరకు 4,97,220 మంది అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను ‘ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఐఎ్‌ఫఎంఐఎస్‌)’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నెల 25లోపు అప్‌లోడ్‌ చేయకపోతే అక్టోబరు నెల వేతనాలు అందవని హెచ్చరించింది. గడిచిన నెల వివరాలను తదుపరి నెల 10వ తేదీలోపు అప్‌లోడ్‌ చేయాలంటూ గతంలోనే ఆదేశించినా.. పలు శాఖల అధికారులు అప్‌లోడ్‌ చేయలేదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు వివరాలను సెప్టెంబరు 20లోపు అప్‌లోడ్‌ చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా పలు శాఖలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల 16 వరకు అప్‌లోడ్‌ చేసిన వివరాలను వెల్లడించారు. మొత్తం 5,21,692 రెగ్యులర్‌ ఉద్యోగుల్లో 2,22,376 మంది ఉద్యోగుల వివరాలు, మొత్తం 4,93,820 మంది తాత్కాలిక ఉద్యోగుల్లో 2,74,844 మంది సిబ్బంది వివరాలను మాత్రమే అప్‌లోడ్‌ చేశారని ప్రభుత్వం వెల్లడించింది. అంటే మొత్తం 10,15,512 మంది ఉద్యోగుల్లో 4,97,220 మంది ఉద్యోగుల వివరాలను మాత్రమే అప్‌లోడ్‌ చేశారని, ఇంకా 5,18,292 మంది వివరాలను అప్‌లోడ్‌ చేయలేదని తెలిపింది. ఇప్పటికైనా అన్ని శాఖల్లోని ఉద్యోగులకు సంబంధించిన ఆధార్‌, ఫోన్‌ నంబర్లు, వారు రెగ్యులర్‌ ఉద్యోగులా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం, డెయిలీ వేజ్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌, ఫుల్‌ టైమ్‌, గంటల వారీగా పని చేస్తున్నారా అన్న వివరాలను పోర్టల్‌లో పొందుపరచాలని సూచించింది. ఒక ఉద్యోగికి వేతనం చెల్లిస్తున్నారా, గౌరవ వేతనంపై పని చేస్తున్నారా అన్న వివరాలను కూడా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 18 , 2025 | 05:20 AM