Share News

అర్హులను ఎంపిక చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:31 PM

పార దర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అర్హులను ఎంపిక చేయాలి
చుక్కాయిపల్లిలో లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- గ్రామసభలో మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : పార దర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రా మంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల లబ్ధిదా రుల ఎంపికపై నిర్వహించిన గ్రామసభలో మం త్రి పాల్గొన్నారు. 20 మందిలో నలుగురు అన ర్హులను ఎంపిక చేశారని కాలనీవాసులు అభ్యం తరం వ్యక్తం చేశారు. వారి పేర్లను తొలగించా లని మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రావును మంత్రి జూపల్లి ఆదేశించారు. మంత్రి వెంట సింగిల్‌విండో డైరెక్టర్‌ పసుపుల నర్సింహ, మాజీ మునిసిపల్‌ కౌన్సిలర్‌ బాలస్వామి, కాం గ్రెస్‌ పార్టీ నాయకులు మహేష్‌, లక్ష్మ య్య, మదగం రాజేష్‌, మునిసిపల్‌ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి జూపల్లికి సన్మానం

కొల్లాపూర్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లా రా రైస్‌మి ల్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును శా లువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల నాగర్‌ కర్నూల్‌ జిల్లా రా రైస్‌మిల్‌ అసో సియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆకు తోట నవీన్‌తో పాటు నూతన కమిటీ ఎన్నుకున్నారు. అసోసియే షన్‌ అధ్యక్షుడు ఆకుతోట నవీన్‌, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి కందుకూరి ప్రసాద్‌ల నేతృత్వంలో మంత్రి జూపల్లిని స న్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ 327 భవనం ప్రారంభం

కందనూలు : నాగర్‌కర్నూల్‌ జిల్లా కేం ద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో విద్యుత్‌ కా ర్మికుల యూనియన్‌ ఐఎన్‌టీ యూసీ 327 నూ తన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. మంత్రి మా ట్లాడుతూ విద్యుత్‌ కార్మికుల సేవలు అభినం దనీయమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్‌ నాయకులు ఈ.శ్రీధర్‌, భూపా ల్‌రెడ్డి, స్థానిక నాయకులు లాలయ్య, లక్ష్మయ్య, నిరంజన్‌, జే.శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, పిల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:31 PM