Share News

విద్యుత్‌ అధికారుల పల్లెబాట

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:25 PM

మండలంలోని కొమ్మెర సెక్షన్‌ పరి ధిలోని సోమనపల్లి గ్రామంలో విద్యుత్‌ శాఖ అధికారులు శుక్రవారం పల్లెబా ట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్‌ వినియోగదారులకు పలు సూచన లు చేశారు. నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు వాడాలని సూచించారు.

విద్యుత్‌ అధికారుల పల్లెబాట

చెన్నూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొమ్మెర సెక్షన్‌ పరి ధిలోని సోమనపల్లి గ్రామంలో విద్యుత్‌ శాఖ అధికారులు శుక్రవారం పల్లెబా ట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్‌ వినియోగదారులకు పలు సూచన లు చేశారు. నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు వాడాలని సూచించారు. ఇంటికి ఎర్తిం గ్‌ చేసుకోవాలని, ఫ్రిజ్‌లు, కూలర్లు ప్రతి ఒక్కదానికి ఎర్తింగ్‌ చేయించాలన్నా రు. ఎర్తింగ్‌ చేసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఇంటికి నాణ్యమైన సర్వీస్‌ వైరు, డీపీ మెయిన్‌ స్విచ్‌ ఫ్యూజ్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ ఫి ర్యాదులుంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ట్రాన్స్‌కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజమల్లు, లైన్‌మెన్‌ సురే ష్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 10:25 PM