Share News

kumaram bheem asifabad- విద్యుత్‌ ప్రమాదం.. అప్రమత్తతే కీలకం

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:21 PM

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు విద్యుత్తు ఉపక రణాలు వినియోగిస్తాం. కనీస జాగ్రత్తలు పాటించకుం టే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అసలే వర్షాకాలం ఇంటా.. బయట విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.

kumaram bheem asifabad- విద్యుత్‌ ప్రమాదం.. అప్రమత్తతే కీలకం
లోగో

- జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన

వాంకిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు విద్యుత్తు ఉపక రణాలు వినియోగిస్తాం. కనీస జాగ్రత్తలు పాటించకుం టే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అసలే వర్షాకాలం ఇంటా.. బయట విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. గాలివానకు విద్యుత్‌ స్థంభాలు కూలిపోవడం, విద్యుత్‌ వైర్లు తెగిపడడం వంటివి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్‌ ప్రమాదాల బారినపడకుండా ఉంటారని విద్యుత్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఫ ప్రమాదాలకు కారణాలు..

- గ్రామాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఇళ్ల మధ్యన, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉండి వాటికి చుట్టు కంచే లేకపోవడం.

- గ్రామాల్లో ఇళ్ల పైనుంచి ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు ఉండటం

- వ్యవసాయ బావుల పంట పొలాల్లో చేతికందే ఎత్తులో కర్రలపై ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు ఉండటం

- వర్షాకాలంలో ఈదురు గాలులకు చెట్ట కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడటవల్ల, విద్యుత్‌ స్థంభాలు ఒకవైపు వంగడం, విరిగిపోవడం వంటివి జరిగి ప్రమా దాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫ విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్న తీరు..

- ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజ్‌ వైర్లు మార్చడం, చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నప్పుడు విద్యుత్‌ సరఫరాఅ యి ఉండడం వల్ల విద్యత్‌ షాక్‌కు గురికావడం.

- వర్షాకాలంలో ఈదురు గాలులకు విద్యుత్‌ స్తం భాలు నేలకొరడగం, తీగలు తెగిపడడంతో ప్రమాదాలు జరుగుతాయి.

- వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ స్తంభం నుంచి స్టార్టర్‌ డబ్బాలోకి ఉండే కనెక్షన్‌ సరైన వైరింగ్‌ లేక పోవడంవల్ల ఏమరపాటుతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.

- స్టార్టర్‌ డబ్బా నుంచి బోరు, బావి మోటార్లకు వెళ్లే విద్యుత్‌ వైరు కనెక్షన్‌ పొదల్లో ఉండి గడ్డి కొస్తున్నప్పు డు ప్రమాదాలు జరుగుతాయి.

ఫ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- విద్యుత్‌ స్తంభాలను, తెగిపడిన విద్యుత్‌ తీగలను తాకకూడదు..

- తడి చేతులతో విద్యుత్‌ స్విచ్‌లను, పరికరాలను ముట్టుకోవద్దు.

- పశువులను విద్యుత్‌ స్తంభాలకు, సమీపంలో కట్టి వేయోద్దు.

- పంటపొలాల వద్ద బావి, బోరు మోటార్లు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సొంతంగా మరమ్మతులు చేయోద్దు.

- నాణ్యమైన స్టార్టర్‌ డబ్బాలు, సర్వీస్‌ వైరు వాడాలి.

- విద్యుత్‌ స్తంభం నుంచి స్టార్టర్‌ డబ్బాలోకి, స్టా ర్టర్‌ డబ్బా నుంచి బోరు, బావి మోటర్లకు వెళ్లే విద్యుత్‌ కనెక్షన్‌ కు సరైన వైరింగ్‌ ఉండేటట్లు చూసుకోవాలి.

- ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో ఇంట్లోని టీవీ, కంప్యూటర్‌, ఫ్రీడ్జ్‌ వంటివి ఆఫ్‌ చేయాలి.

ఫ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి..

- శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ ఏఈ

ఎక్కడైనా విద్యుత్‌ సమస్యలు వస్తే వెంటనే విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. విద్యుత్‌ ప్రమా దాల బారిన పడకుండా రైతులు, ప్రజలు తగిన జాగ్రత్త లు తీసుకోవాలి. గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ సమస్యలు ఏర్పడితే సొంతంగానే మరమ్మతులు చేస్తున్నారు. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశా లు ఉంటాయి. ప్రజలు సొంతంగా మరమ్మతులు చేయకూడదు.

Updated Date - Sep 02 , 2025 | 10:21 PM