Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎలక్ట్రిక్ వీల్‌చైర్లు
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:10 AM
విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించే దిశగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీఎంఆర్) ఒక ముందడుగు వేసింది..
శంషాబాద్ రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించే దిశగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీఎంఆర్) ఒక ముందడుగు వేసింది. ప్రయాణికుల కోసం అత్యాధునిక ఎలక్ట్రిక్ వీల్ చైర్లను ప్రవేశపెట్టిన్నట్లు జీఎంఆర్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి ఈ నూతన వీల్ చైర్లను ప్రవేశపెట్టారు. ఈ ఎలక్ట్రిక్ వీల్ చైర్లు ప్రయాణికుల చెక్ ఇన్ కౌంటర్ దాటిన తర్వాత అందుబాటులోకి వస్తాయి. డీఎ్‌ఫఎండీ పాయింట్ నుంచి బోర్డింగ్ పాస్ వరకు వీటిని వినియోగించుకోవచ్చు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని జీఎంఆర్ అధికారులు స్పష్టం చేశారు.