ఎన్నికలను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:43 PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులందరు ఎన్నికల నియమావళి తప్పసరిగా పాటించి శాంతియుత వాతవరణంలో ఎన్నికలు జరుపుకోవాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అభ్యర్థుల కు సూచించారు. మండలంలోని కాసిపేట, దండేపల్లిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
దండేపల్లి డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులందరు ఎన్నికల నియమావళి తప్పసరిగా పాటించి శాంతియుత వాతవరణంలో ఎన్నికలు జరుపుకోవాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అభ్యర్థుల కు సూచించారు. మండలంలోని కాసిపేట, దండేపల్లిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామాలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల నియమావళిపై ప్రజలు, అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందేది ఓటు హక్కుతోనే, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను ఆ యన ప్రోత్సహించారు. శాంతియుత వాతవరణంలో ఎన్నికలు సజావుగా జ రుపుకునేందుకు అందరు కృషి చేయాలన్నారు. డీసీపీ వెంట లక్ష్సెటిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తాహసీనోద్థీన్ ఉన్నారు.