ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:12 PM
గ్రామపంచాయ తీలకు ఎన్నికల నేపథ్యంలో నా మినేషన్ల స్వీకరణలో పంచాయ తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని జడ్పీ డిప్యూటీ సీఈవో గోపా ల్‌నాయక్ అన్నారు.
- జడ్పీ డిప్యూటీ సీఈవో గోపాల్‌నాయక్
తాడూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయ తీలకు ఎన్నికల నేపథ్యంలో నా మినేషన్ల స్వీకరణలో పంచాయ తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని జడ్పీ డిప్యూటీ సీఈవో గోపా ల్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇంద్రకల్, తాడూ రు తదితర గ్రామాల్లోని నామినే షన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అప్రమత్తంగా ఉండి వెంటనే ఉన్నతాధికారుల కు సమాచారమివ్వాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల ఎవరూ అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవ డంతో పాటు అవసరమైతే ఎన్నికల నియమావళి ప్రకారం సస్పెండ్ సైతం చేస్తారని హెచ్చరించారు. ప్రతీ పంచాయతీ అధికారి క్షేత్రస్థాయిలో అప్రమత్తం గా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎం పీడీవో ఆంజనేయులు, ఆయా గ్రామాల స్టేజ్-1, స్టేజ్-2 ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బంది, పంచాయ తీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా జరగాలి : ఆర్డీవో
తాడూరు, (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచా యతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణం లో అభ్యర్థులు తమ నామినేషన్ల ప్రక్రియను కొనసాగించే విధంగా అందరూ సహకరించా లని ఆర్డీవో సురేష్ కుమార్ సూచించారు. శుక్ర వారం మండల కేంద్రంతో పాటు మండలం లోని యాదిరెడ్డిపల్లి, అంతారం, ఇంద్రకల్ త దితర గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సి బ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణయ్య, ఆర్‌ఐ సల్మాన్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.