Share News

రిజర్వేషన్‌లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:26 PM

42 శాతం రిజర్వే షన్‌లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కు ల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల ప ట్టణంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై ని ల్చుని నిరసన వ్యక్తం చేశారు.

రిజర్వేషన్‌లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలి
మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేస్తున్న బీసీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : 42 శాతం రిజర్వే షన్‌లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కు ల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల ప ట్టణంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై ని ల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్‌ సభలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం జులై లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది బీసీలను నమ్మించి మోసం చేయ డమేనన్నారు. స్ధానిక సంస్థల రిజర్వేషన్‌లు పెంచుకునే అధికారం ఆ యా రాష్ట్రాలకు ఉందని అయినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ కపోవడం బీసీలపై వివక్ష చూపడమేనన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, నాయకులు తుల మధు సూదన్‌, లచ్చన్న, భీమ్‌సేన్‌, వెంకటయ్య, నర్సయ్య, బిక్షపతి, అంజన్న, అశోక్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:26 PM