Share News

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:37 PM

నేడు జరిగే మూడవ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మోహ న్‌రెడ్డి సూచించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మోహన్‌రెడ్డి

చెన్నూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : నేడు జరిగే మూడవ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మోహ న్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ క్రీడా మైదానం లో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలను పక డ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. మం డలంలోని 29 గ్రామపంచాయతీల్లో 238 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 238 మంది పీవోలు, 238 ఓపీవోలను ని యమించారు. పోలింగ్‌ కేంద్రాలను మూడు జోన్‌లుగా విభజిం చగా ఆరు రూట్‌లను ఏర్పాటు చేశారు. 5 సమస్యాత్మక కేంద్రా లుగా గుర్తించారు. 5 వెబ్‌ కాస్టింగ్‌లను ఏర్పాటు చేశారు. పో లింగ్‌ అదికారులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి 14 వాహనాలను ఏర్పాటు చేశారు. ఆయన వెంట అడిషనల్‌ కలె క్టర్‌ చంద్రయ్య , మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీవో మోహన్‌, ఎంపీవో అంజద్‌, ఏసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:37 PM