ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:45 PM
ఈనెల 11 నిర్వహించే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల అధికారు లు, సిబ్బంది గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని మంచిర్యాల డీఎల్పీవో ధర్మరాణి సూచించారు.
మంచిర్యాల డీఎల్పీవో ధర్మరాణి
దండేపల్లి డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈనెల 11 నిర్వహించే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల అధికారు లు, సిబ్బంది గ్రామ పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని మంచిర్యాల డీఎల్పీవో ధర్మరాణి సూచించారు. సోమవారం దండేపల్లిలో మండల పరిషత్ కార్యలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలో విధులు నిర్వహించే పివోలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తీరును ఆమె పరిశీలిం చారు.. ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయక పొలింగ్ అధికారుల పాత్ర కీలకమని పంచాయతీ ఎన్నికలను పకడ్బిందీగా నిర్వహించాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటు కీలకమని, ఎన్నికల అధికారులు తగు జాగ్రత్తలు పాటించి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం సిద్ధమైన ఎన్నికల సామగ్రిని, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే తీరును ఆమె పరిశీలించారు. ఈకా ర్యక్రమంలో ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎంపివో విజయప్రసాద్ ఉన్నారు.