Share News

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:08 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌జీ

- ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

అచ్చంపేటడిసెంబరు4, (ఆంద్రజ్యోతి) : ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. గురువారం పట్టణంలోని పో లీస్‌ స్టేషన్‌ను కస్మికంగా తనిఖీ చేశారు. అనం తరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎన్నికల సరళి గురించి నామి నేషన్‌ కేంద్రాలు వద్ద బందోబస్తు గురించి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎన్ని ఉన్నా యో అధికారులను అడిగి తెలుసుకొని తీసుకో వాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అదేవి ధంగా రౌడీషీటర్ల వివరాలు తెలుసుకొని వారి కార్యక లాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండా లని ఆదేశించారు. అనంతరం మండల పరిధి లోని నడింపల్లి, పల్కపల్లి గ్రామాలలో పోలింగ్‌ కేం ద్రాలను డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరా జులతో కలిసి పరిశీలించారు.

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలి

ఫ మన్ననూర్‌ : జిల్లా పరిఽధిలోని మన్ననూ రు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘాపెట్టి క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ పోలీసులకు సూచించారు. అమ్రాబా ద్‌ మండలం మన్ననూరులోని శ్రీశైలం- హైద రాబాద్‌ ప్రధాన రహదారిపై గల అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టును ఆయన గురువారం సందర్శించా రు. పంచాయతీ ఎన్నికల నేపఽథ్యంలో డబ్బు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణాను అరిక ట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేసేందుకై చెక్‌పోస్టుల వద్ద పోలీస్‌ శాఖ భద్రతను కట్టు దిట్టం చేసిందని అన్నారు. ఎస్పీ వెంట అమ్రాబాద్‌ సీఐ శంకర్‌ నాయక్‌, ఎస్‌ఐ గిరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 11:08 PM