kumaram bheem asifabad- ఎన్నికల వేళ.. ఖాళీల గోల
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:36 PM
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎంపీడీవోలు, ఎంపీవోల పాత్ర కీలకం. అటువంటిది జిల్లాలో ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగుల ఖాళీలు కలవర పెడుతున్నాయి. స గం మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి పాలన సాగిస్తున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎంపీడీవోలు, ఎంపీవోల పాత్ర కీలకం. అటువంటిది జిల్లాలో ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగుల ఖాళీలు కలవర పెడుతున్నాయి. స గం మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి పాలన సాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఎంపీవో లు, సూపరింటెండెంట్‌లనే ఎంపీడీవోలుగా నియమిం చారు. జిల్లా మండల పరిషత్తులు, పంచాయతీల ఎన్నికలు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అక్టోబ రులో విడతల వారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఉంటుంది. ఈ ఎన్నికల్లో మండల స్థాయిలో సహాయక ఎన్నికల అధికారిగా ఎంపీడీవోలే వ్యవహ రిస్తారు. వీరు కింది స్థాయి ఉద్యోగుల సహకారంతో ముందుకు సాగుతారు. పోలింగ్ బూత్‌లలో వసతులు, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఓటర్ల జాబితా, వాహనాలు సిద్ధం చేయించడం, నామినేషన్ల స్వీకరణ, పోటీల్లో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఇలా ప్రతి పనిలో వారి పాత్ర ఉంటుంది. ఇంతటి కీలకమైన బాధ్యతలు చూడాల్సిన ఎంపీడీవోలు, కింది స్థాయి ఉద్యోగుల కొరతతో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుం దన్న భయం వెంటడుతోంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు, 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 15 ఎంపీడీవో పోస్టులకు గాను ఏడుగురు పని చేస్తుండగా ఎనిమిది ఖాళీలు ఉన్నాయి. అలాగే 15 ఎంపీవో పోస్టులకు ఎనిమిది మంది పని చేస్తుండగా ఏడు ఖాళీలున్నాయి. అలాగే ఆరు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ యా మండలాలు, పక్క మండలాల్లోని ఎంపీవోలు, సూపరింటెండెంట్‌లకే ఎంపీడీ వోలుగా కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా జిల్లాలో ఏడు ఎంపీ వో, ఆరు సూపరింటెండెంట్, ఆరు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నచోట సీనియర్ కార్యదర్శులు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఎంపీడీవోలు ఇన్‌చార్జిగా కానీ, రెండేసీ చోట్ల బాధ్య తలు నిర్వహించడం కానీ కుదరదు. ఎంపీడీవోగానే పూర్తి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇన్‌చార్జి ఉన్న చోట వారిని పూర్తి స్థాయి ఎంపీడీవోలుగా నియమిస్తూ అదనపు బాధ్యతలు తొలగిస్తున్నారు. ఖాళీ ఉన్నచోట కిందిస్థాయి ఉన్న వారిని నియమిస్తున్నా ఆ స్థానం ఖాళీ అవుతుంది. పైగా కిందిస్థాయి ఉద్యోగుల్లో కొందరికి ఎన్నికలపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోం దని ఎంపీడీవోలు మదన పడుతున్నారు. తాజాగా గ్రూప్-1 ఉద్యోగుల భర్తీ నేపథ్యం లో ఎంపీడీవో పోస్టులు ఎన్నుకున్న వారిలో ఐదు నుంచి ఏడుగురిని జిల్లాకు కేటాయిస్తారన్న ప్రచారం సాగు తోంది. కానీ కొత్త వారు శిక్షణ లేకుండా ఎలా విధులు నిర్వహి స్తారన్న చర్చ జరుగుతోంది.