Food Shortage: భోజనాల్లేక ఖాళీ ప్లేట్లతో నిరీక్షణ
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:46 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమైన సిబ్బంది మంగళవారం భోజనాలు లేక ఇబ్బందిపడ్డారు.....
నారాయణఖేడ్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమైన సిబ్బంది మంగళవారం భోజనాలు లేక ఇబ్బందిపడ్డారు. పట్టణ శివారులోని మోడల్ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద ఆందోళన నిర్వహించారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ కోసం 1600 మంది సిబ్బందిని నియమించారు. వీరికి సరిపడా భోజన ఏర్పాట్లు చేయకపోవడంతో 50 శాతం సిబ్బందికి అందలేదు. వారంతా జిల్లా గిరిజన సంక్షేమాధికారి జగదీశ్ ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసనకు దిగారు. భోజనాలు వడ్డించే టేబుళ్ల వద్ద గంట సేపు ఖాళీ ప్లేట్లతో నిల్చుకున్నారు. మునిసిపల్ కమిషనర్, ఎంపీడీవో, తహసీల్దార్ జోక్యం చేసుకొని పట్టణంలోని వివిధ హోటళ్ల నుంచి, సమీపంలోని జ్యోతిబాపూలే గురుకులం నుంచి భోజనాన్ని తెప్పించి వడ్డించారు.