Share News

kumaram bheem asifabad-ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:16 PM

రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రెండో విడత సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 14న జరిగే పోలింగ్‌ ప్రక్రియ ముగింపు సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగనున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ జరుగనున్న ప్రాంతాల్లో పోలింగ్‌ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం నిబంధన అమలులో ఉంటుందని, ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సంబంధిత పోలింగ్‌ ప్రాంతాల్లో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

kumaram bheem asifabad-ఎన్నికల నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రెండో విడత సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 14న జరిగే పోలింగ్‌ ప్రక్రియ ముగింపు సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగనున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ జరుగనున్న ప్రాంతాల్లో పోలింగ్‌ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం నిబంధన అమలులో ఉంటుందని, ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సంబంధిత పోలింగ్‌ ప్రాంతాల్లో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, సినిమా, టెలివిజన్‌, సోషల్‌ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ఎలాంటి సంగీత, నాటక, వినోద కార్యక్రమాల రూపంలో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడంతో పాటు పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని సమకూర్చి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Dec 12 , 2025 | 10:16 PM