Share News

kumaram bheem asifabad-ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:03 PM

ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జైనూర్‌ సీఐ రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌక్‌లో జైనూర్‌ సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నిక నియమావళిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

kumaram bheem asifabad-ఎన్నికల నిబంధనలు పాటించాలి
సిర్పూర్‌(యు)లో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

సిర్పూర్‌(యు), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జైనూర్‌ సీఐ రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌక్‌లో జైనూర్‌ సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నిక నియమావళిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక నిబంధనలను కచ్చితంగా పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా,స్వేచ్ఛగా జరిగేందుకు తన ఓటును ఎటువంటి భయాందోళనలు లేకుండా వినియోగించాలని సూచించారు. ప్రత్యేకంగా ఓటర్లును ప్రభావితం చేసే ప్రయత్నాలు డబ్బు, మద్యం ప్రలోభాలు, బెదిరింపులు కలిగించడం వంటి చర్యలుపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన హక్కు కావడంతో దాన్ని నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో సిర్పూర్‌(యు) ఎస్సై రామకృష్ణ, లింగాపూర్‌ ఎస్సై గంగన్న, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జైనూర్‌ సీఐ రమేశ్‌ లింగాపూర్‌ ఎస్సై గంగన్నలు అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని పిక్లాతండా తదితరా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్పీ ఆదేశాల మేరకు 50 మంది పోలీసులతో కవాతు నిర్వహంచారు. ఈ సంధర్భంగా సీఐ మాట్లాడారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదగని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బారెగూడ, కుడ, పోతెపల్లి, బెజ్జూరు గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలు దారి తీయకుండా చూసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో అనవసరమైన వాటని పోస్టు చేయవద్దని అన్నారు. దీని కారణంగా గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు సర్తాజ్‌పాషా, నరేష్‌, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:03 PM