Share News

ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించాలి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:09 PM

సాధా రణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించాలని కలెక్టర్‌ కుమార్‌ దీప క్‌ అన్నారు.

ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించాలి

ఫ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): సాధా రణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల నియమావళిని సక్రమంగా పాటించాలని కలెక్టర్‌ కుమార్‌ దీప క్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం కలెక్టరేట్‌ చాం బర్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి రిటర్నింగ్‌ సహా య అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల అయినందున ఎ న్నికల నిర్వహణకు అధికారులకు అవసరమైన శిక్షణ తరగతు లు ఏర్పాటు చేశామని నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాల వరకు అధికారులు నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్‌ల ప్రక్రియ పరిశీలన, డ్యూటీలో ఉండే అభ్యర్థుల జాబితా, ఓట రు స్లిప్‌ల పంపిణీ, మోడల్‌కోర్‌ ఆప్‌ కండక్ట్‌, పోలింగ్‌ కేంద్రా ల ఏర్పాటు ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్ని కలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, జడ్పీసీఈవో గణపతి, డీఈవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యువో రవూఫ్‌ఖాన్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:09 PM