Share News

ఎన్నికల నియమావళి పాటించాలి

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:04 AM

రెండవ సాధారణ ఎన్నికల్లో బా గంగా ప్రతీ ఒక్క అభ్యర్థితో పాటు ఎన్నికల సిబ్బంది సైతం నియమావళి తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు మనో హర్‌ అన్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి

రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకు మనోహర్‌

లక్షెట్టిపేట, డిసెంబర్‌4 (ఆంధ్రజ్యోతి): రెండవ సాధారణ ఎన్నికల్లో బా గంగా ప్రతీ ఒక్క అభ్యర్థితో పాటు ఎన్నికల సిబ్బంది సైతం నియమావళి తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు మనో హర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కేఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో మొదటి విడ తలో ఎన్నికలు జరుగనున్న లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థు లంతా సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. జిల్లా అదనపు ఎన్నికల అధికారి చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థాయి ఎన్నికలు చాలా కీలకమన్నారు. ప్రతీ పైసా ఖ ర్చుకు లెక్క ఉంటుందని నూతనంగా ఒక బ్యాంక్‌ ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి దా ని ద్వారా లావాదేవీలు జరిపి ఎన్నికల అనంతరం అట్టి ఎకౌంట్‌ నుంచి చేసిన ఖర్చు వివరాలు ఎన్నికల సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేశ్వర్‌, నాలుగు మం డలాల తహసీల్దార్‌లు శ్రీనివాస్‌ దేశ్‌పాండే, దిలీప్‌కుమార్‌, రోహిత్‌ దేశ్‌ పాండే, రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, మంచిర్యాల మహిళ పోలీస్‌ స్టేషన్‌ సీఐ నరేష్‌ కుమార్‌, ఎస్సైలు గోపతి సురేష్‌, స్వరూప్‌రాజ్‌, తహ సీయోద్దీన్‌, అనూష పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:04 AM