kumaram bheem asifabad- ఎన్నికల నియమావళి పాటించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:24 PM
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. హైదారాబాద్ నుంచి ఇతర ఎన్నికల అదికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని, నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. హైదారాబాద్ నుంచి ఇతర ఎన్నికల అదికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా గురువారం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. అదికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కోసం బందోబస్తు అదికారులు, సిబ్బంది నియామకం ఇతర ఎన్నికల ఆంశాలకు సంబందించి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రతి జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించనున్నామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా చేపట్టాలని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి నామినేషన్ ప్రక్రియ సమీక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో ఎనిమిది జడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం ఉన్నామని తెలిపారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందిం చామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.