kumaram bheem asifabad- పకడ్బందీగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:14 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం అటవీ శాఖ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అంతకుముందు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం అటవీ శాఖ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అంతకుముందు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్ష పదవి కోసం ఇప్పటి వరకు 50 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, ఓబీసీ అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఆరుగురితో కూడిన ప్యానెల్ తయారు చేసి హైకమాండ్‌కు పంపించనున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా అధ్యక్ష ఎన్నికపై ఎలాంటి ఒత్తిడిలు ఉండవన్నారు. ఫైరవీలకు తావులేకుండా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా అధ్యక్ష ఎన్నికల అనంతరం బ్లాక్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సమావేశంలో డీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్
కాగజ్‌నగర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నేరవేర్చేలా కృషి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు.. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంతా కృషి చేయాలన్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో నాయకులు అనిల్ కుమార్, జ్యోతి, బత్తిని శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ సర్పంచ్‌లు, మాజీ జడ్పీటీసీలు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.