kumaram bheem asifabad- మద్యం వ్యాపారులకు ఎన్నికల కిక్కు
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:22 PM
కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు కిక్కు ఇవ్వనున్నాయి. 2025-27 సంవత్సరానికి ఇటీవలే మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. గత అక్టోబరు 27న జిల్లాలోని 32 లిక్కర్ షాఫులకు లక్కీ డ్రా నిర్వహించారు. షాఫులకు లక్కీ డ్రా ద్వారా లిక్కర్ వ్యాపారులను ఎంపిక చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభించేందుకు మద్యం షాపుల యజమానులు ఏర్పాట్లు చేసుకుంటు న్నారు.
- 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం&
ఓట్ల వేటలో మద్యం పంపిణీ షరామామూలే
- నేటి నుంచి కొత్త లైసెన్సుదారులకు లిక్కర్ కేటాయింపు
చింతలమానేపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు కిక్కు ఇవ్వనున్నాయి. 2025-27 సంవత్సరానికి ఇటీవలే మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. గత అక్టోబరు 27న జిల్లాలోని 32 లిక్కర్ షాఫులకు లక్కీ డ్రా నిర్వహించారు. షాఫులకు లక్కీ డ్రా ద్వారా లిక్కర్ వ్యాపారులను ఎంపిక చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభించేందుకు మద్యం షాపుల యజమానులు ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో లిక్కర్ షాపుల యజమానులకు షాపుల ప్రారంభం లోనే లాభాల కిక్కు తగలనుందని చెబుతున్నారు. ఏడాది కాలంలోనే పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉండడంతో ఈ సారి మద్యం దుకాణాలు దక్కించుకున్న వారకి అమ్మకా లు జోరుగా ఉండనున్నాయని చెబుతున్నారు.
- ప్రారంభంలోనే..
కొత్త మద్యం షాపులకు ప్రారంభంలోనే పంచాయ తీ ఎన్నికల రూపంలో కలిసి వస్తుంది. పాత షాపుల కు సవంబరు 30వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, కొత్త షాపులకు ఈ నెల 28వ తేదీ నుంచే మద్యం కేటాయించనున్నారు. డిసెంబరు 1 నుంచి అమ్ముకు నేందుకు ఎకై్ౖసజ్‌శాఖ అనుమతులు ఇవ్వనుంది. కాగా ఇప్పటికే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల ఘట్టం 29వ తేదీతో ముగి యనుంది. డిసెంబరు 1 నుంచే అసలైన ఎన్నికల సంగ్రామం మొదలు కానుంది. ఇదే తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ఒక్కొక్క గ్రామం లో 15 రోజుల వరకు ఎన్నికల తంతు జరుగుతుంది. అన్ని ప్రధాన పార్టీలు గత మద్దతుదారులను బరిలో దించేందుకు సిద్ధమవుతు న్నారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో మద్యం కీలకమే బహిరంగ రహస్యమే. పోటీ దారులు భారీ ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి డంప్ చేయడం, ఈ తర్వాత పోలింగ్ ముందు పంపిణీ చేయడం జరిగే తంతే. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు లిక్కర్‌కు కూడా భారీగా డిమాండ్ పెరుగ నుంది. దీంతో కొత్తగా మద్యం షాపులను దక్కించు కున్న వారికి పంచాయతీ ఎన్నికలతో భారీగా ఆదా యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
- జిల్లాలో 32 షాపులు
జిల్లాలో 32 షాపులు ఉన్నాయి. రెండేళ్ల పాటు ప్రభుత్వం మద్యం అమ్ముకోవడానికి లైసెన్సులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్లు షాపు ఓనర్లు పూర్తి చేసుకున్నారు. బ్యాంకు గ్యారంటీలతో పాటు షాపు నిర్వహణకు అనువైన ప్రాంతంలో గదులను వెతికే పనిలో పడిపోయారు. కాగా కొత్తగా మద్యం లైసెన్సులు పొందిన వారికి పంచాయతీ ఎన్నికల రూరంలో లక్ కలిసి రానుంది. కొత్త మద్యం షాపు యజమానులకు స్థానిక సంస్థల ఎన్నికలు, పరిష త్, మున్సిపాలిటీ ఎన్నికలు రానుండం మద్యం షాపు యజమానుల పంట పండినట్లేనని చర్చ జరుగు తోంది. ఈ ఏడాదంతా ఏదో రకంగా మద్యా నికి గిరాకీ ఉండనుందని చెబుతున్నారు. మద్యం షాపులు దక్కని వ్యాపారులు భారీగా గుడ్‌విల్ ఆఫర్ చేసి చాలా చోట్ల షాపులను కొనుగోలు చేశారని తెలిసింది. ఆయా ఏరియాలను బట్టి మద్యం షాపులకు రూ. 60లక్షల నుంచి కోటిపై వరకు గుడ్‌విల్ ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేసి నట్లు చెబుతున్నారు.