Share News

మద్యం షాపులకు ఎన్నికల కిక్కు...

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:19 PM

కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు నూతన కిక్కు ను ఇవ్వనున్నాయి. 2025-2027 సంవత్సరానికి గాను ప్ర భుత్వం ఇటీవలే టెండర్లు నిర్వహించింది.

మద్యం షాపులకు ఎన్నికల కిక్కు...

-నేటి నుంచి కొత్త పాలసీ ప్రారంభం

-పంచాయతీ ఎన్నికలతో వ్యాపారుల్లో జోష్‌

-యజమానులకు కలిసి వచ్చిన అదృష్టం

మంచిర్యాల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం షాపులకు పంచాయతీ ఎన్నికలు నూతన కిక్కు ను ఇవ్వనున్నాయి. 2025-2027 సంవత్సరానికి గాను ప్ర భుత్వం ఇటీవలే టెండర్లు నిర్వహించింది. గత అక్టోబరు 27న జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షె ట్టిపేట ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 73 షాపులకు లక్కీ డ్రా ద్వారా నిర్వహించి, లబ్దిదారులను ఎంపిక చేశారు. పాత మద్యం పాలసీ సెప్టెంబరు 30తో ముగుస్తుండగా, ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభంచేందు కు యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్ర మంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం షె డ్యూల్‌ ప్రకటించడంతో వైన్‌ షాపుల యజమానుల ఆ నందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్య మా అని వైన్‌ ప్రారంభంలోనే బోణీ అదిరిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే మద్యం పాలసీలో అం టే మరో ఏడాది కాలంలో మున్సిపాలిటీ, పరిషత్‌ ఎన్ని కలు నిర్వహించే అవకాశం ఉండటం, సమ్మక్క-సారల మ్మ జాతర కూడా జనవరిలో ఉన్నందున ఈ సారి మ ద్యం దుకాణాలు దక్కించుకున్న వారిని అదృష్టం వరిం చినట్లేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. కొత్త మ ద్యం షాపుల టెండరు ఫీజు పెరిగినందున కొందరు వ్యాపారులు ఈసారి షాపులకు దూరంగా ఉన్నారు. వా రందరికీ ఎన్నికల రూపంలో ఆశనిపాశమే ఎదురవు తుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

భారీగా స్టాకు దింపే యోచనలో...

కొత్త మద్యం షాపులకు డిసెంబరు 1వ తేదీ నుంచి విక్రయాలు జరిపేందుకు ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ అనుమ తులు మంజూరు చేసింది. ఆదివారంతో పాత లైసెన్సు గడువు ముగుస్తుండటంతో మరునాడు నుంచే కొత్త షా పుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మ రోవైపు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడు దల కావడంతో షాపుల నిర్వాహకులు భారీగా స్టాకును దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరు 27 వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు మూడు విడు తల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి వి డుత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియగా, డిసెంబరు 1వ తేదీ నుంచి అభ్యర్థులంతా ప్రచారం ఊదరగొట్టనున్నారు. అలాగే రెండో విడుత ఎన్నికల నామినేషన్లు సైతం ఆదివారం నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 2వ తేదీతో ముగి యనున్నాయి. రెండో విడుతలో 4వ తేదీ నుంచే అభ్య ర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఇక మూడో విడుత నామినేషన్లు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాగా, 6వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రచారబాట పట్టనున్నారు. మూడు విడతల ఎన్నికలు ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరుగనున్నాయి. అంటే కొత్త వైన్‌ షాపులు ప్రారంభ మైన నాటి నుంచి తొలి పక్షం రోజులు మద్యం విక్ర యాల్లో జోష్‌ నిండనుంది.

యజమానులకు కాసుల వర్షం...

కొత్త మద్యం షాపు యజమానులకు ఈ మద్యం పా లసీలో కాసుల వర్షం కురియనుంది. ఈ నెల 17వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండగా, ఆ తరువాత జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నా లుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మ జాతర ఉంది. జాతర సమయంలో గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తారు. అలాగే ఇళ్లలోనూ సమ్మక్క మొ క్కులు చెల్లించడం ఆనవాయితీ. ఆయా వేడుకల్లోనూ మద్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇ ప్పటికే వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా రెండు, మూడు నెలల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మున్సిపాలిటీల పదవీకాలం ముగి సి కూడా దాదాపు ఏడాదిన్నర సమయం కావస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలను కూడా ఈ ఏడాదిలోపే నిర్వ హించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా వరుస ఎన్నికల తోపాటు సమ్మక్క మహా జాతర ఉండటంతో వైన్‌ షా పుల యజమానుల పంట పండినట్లేనన్న చర్చ జరుగు తోంది. మొత్తంగా ఈయేడు మద్యం షాపులు దక్కిం చుకున్న వ్యాపారులకు అదృష్టం కలిసి వచ్చినట్లేనన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.

Updated Date - Nov 30 , 2025 | 11:19 PM