kumaram bheem asifabad- ఎన్నికల మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:05 PM
సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్గ దర్శకాలను సమర్థవతంగా అమలు యేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి హాజరయ్యారు.
సిర్పూర్(టి), నవంబరు 29( ఆంధ్రజ్యోతి): సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్గ దర్శకాలను సమర్థవతంగా అమలు యేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియల నిర్వహణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది సమన్వయం, ఎన్నికల సామగ్రి పంపిణీ అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించా లని, విధులలో పారదర్శకంగా , నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే ఉన్నత అధికారులను సంప్రదించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, విధు లలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యార్థులకు క్రీడా అవసరాల కోసం తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, నీటి అవసరాలకు పాఠశాల చేతి పంపు మరమ్మతు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన విధులు నిర్వహించిన ఉపాధ్యా యుల నుంచి విధి నిర్వహణలో అలసత్వానికి సంఘటనకు కారణాలపై వివరణ తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు నారాయణసింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎంఈవో ను ఆరోపణలపై వివరణ కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.