Deputy Chief Minister Bhatti Vikramarka: నవీన్ ను గెలిపించడం మనందరి బాధ్యత!
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:37 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వెంగళరావునగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో కలిసి ఆయన యూసు్‌ఫగూడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఉప ఎన్నికలో అందరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు భట్టి సూచించారు.