Share News

Elder Abuse: 20 ఎకరాలు తీసుకొని బుక్కెడు బువ్వ పెడ్తలేరు!

ABN , Publish Date - Oct 10 , 2025 | 03:51 AM

తన 20 ఎకరాల భూమిని తీసుకున్న ఇద్దరు కొడుకులు బుక్కెడు బువ్వ కూడా పెడ్తలేరంటూ సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం మంతూరుకు చెంది...

Elder Abuse: 20 ఎకరాలు తీసుకొని బుక్కెడు బువ్వ పెడ్తలేరు!

  • ఇద్దరు కొడుకులు పట్టించుకోవట్లేదంటూ గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో వృద్ధురాలి ఆవేదన

గజ్వేల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తన 20 ఎకరాల భూమిని తీసుకున్న ఇద్దరు కొడుకులు బుక్కెడు బువ్వ కూడా పెడ్తలేరంటూ సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం మంతూరుకు చెందిన వృద్ధురాలు కర్ల నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం గజ్వేల్‌ ఆర్డీవో చంద్రకళకు దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ.. తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమితో పాటు, తాము సంపాదించిన భూమిని తన ఇద్దరు కుమారులు వారి పేరుపై పట్టా మార్పిడి చేసుకున్నారని తెలిపారు. పెద్ద కుమారుడు ఇంటికి వెళ్తే బయటకు గెంటేశాడని.. చిన్న కుమారుడు తీసుకెళ్లి నెల తర్వాత పెద్ద కుమారుడి దగ్గరికే పోవాలని పంపించేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన కూతురు దగ్గర రెండేళ్లున్నానని.. చివరకు సోదరులు తిట్టడంతో ఆమె సైతం బయటకు పంపించేసిందని వాపోయారు. ఈ విషయమై గతంలో ఆర్డీవోను కలిస్తే తనకు పోషణ ఖర్చులు చెల్లించాలని కొడుకులకు చెప్తే పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాలని మరోసారి ఆర్డీవోను కలిసి కోరినట్టు నర్సమ్మ చెప్పారు.

Updated Date - Oct 10 , 2025 | 03:52 AM