Share News

Requests Cancellation of Her Pension: నా పింఛన్‌ రద్దు చేయండి

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:56 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవడానికి అందరూ పోటీపడి దరఖాస్తు చేసుకుంటారు...

Requests Cancellation of Her Pension: నా పింఛన్‌ రద్దు చేయండి

  • ఓ వృద్ధురాలి దరఖాస్తు

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవడానికి అందరూ పోటీపడి దరఖాస్తు చేసుకుంటారు. కానీ, ఓ వృద్ధురాలు మాత్రం పింఛను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. తద్వారా, తనకు వచ్చే పింఛను డబ్బులు ఇతర నిరుపేదలకు ఉపయోగపడతాయనే మానవీయ కోణంలో ఆలోచించింది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ యాకుబ్‌ భార్య అబ్బాస్‌ బీ(75) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి, కుత్బుల్లాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటోంది. ఆమెకు ఇక్కడే ప్రభుత్వ గుర్తింపుకార్డులన్ని ఉండడంతో, సంక్షేమ ఫథకానికి దరఖాస్తు చేసుకోగా వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. అయితే, కుటుంబమంతా తిరిగి స్వంత రాష్ట్రానికి మకాం మార్చడంతో తనకు వస్తున్న పింఛను రద్దు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డబ్బుల్ని ఎవరైనా పేదలకు అందించేలా చూడాలని దరఖాస్తులో పేర్కొనడంతో అధికారులు ఆమె నిజాయితీని అభినందించారు.

Updated Date - Sep 12 , 2025 | 03:56 AM