Share News

Minister Juplly Krishna Rao: ఉచిత విద్యుత్తు అని బిల్లులేస్తున్నారేంవృద్ధులకు ఇస్తానన్న 4వేలు ఎక్కడ?

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:59 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వృద్థురాలు...

Minister Juplly Krishna Rao: ఉచిత విద్యుత్తు అని బిల్లులేస్తున్నారేంవృద్ధులకు ఇస్తానన్న 4వేలు ఎక్కడ?

  • ప్రచారంలో మంత్రి జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు

ఎర్రగడ్డ, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి) : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వృద్థురాలు మంత్రిని నిలదీసింది. రేవంత్‌ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు ఏం చేశారని అడిగింది. వయోవృద్ధులకు 4వేలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా.. అవెక్కడని ప్రశ్నించింది. ఉచితవిద్యుత్తు అన్నవారు బిల్లులు ఎందుకు వేస్తున్నారని అడిగింది. మంత్రి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ‘నాకు వినేఓపిక లేదు. వాగ్దానా లు నెరవేర్చకుండా మళ్ళీఓట్లు అడగడానికి వచ్చారని’ ఆమె మండిపడింది.

Updated Date - Oct 31 , 2025 | 02:59 AM