Hyderabad Traffic: ఒకే స్కూటర్‌పై ఎనిమిది మంది
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:38 AM
ఒక బైకుపై ముగ్గురు ప్రయాణించడమే నేరం. అదీ ప్రమాదకరం కూడా. కానీ ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఎనిమిది మంది ప్రయాణిస్తే! హైదరాబాద్ బెంగళూర్...
నడిరోడ్డుపై యువకుల హల్‌చల్.. కేసు నమోదు చేసిన పోలీసులు
శంషాబాద్ రూరల్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఒక బైకుపై ముగ్గురు ప్రయాణించడమే నేరం. అదీ ప్రమాదకరం కూడా. కానీ ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఎనిమిది మంది ప్రయాణిస్తే! హైదరాబాద్ బెంగళూర్ జాతీయ రహదారిపై గగన్ పహాడ్ ప్రాంతంలో కొందరు యువకులు ఇలా హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో పోలీసులు ఆ స్కూటర్ నంబర్, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గగన్‌పహాడ్‌కు చెందిన అఖిల్ (21)తోపాటు ఏడుగురు మైనర్లు గత నెల 21న అర్ధరాత్రి 1.30 గంటలకు ఇలా తిరిగినట్టు గుర్తించినట్టు సీఐ బాల్‌రాజ్ తెలిపారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, అఖిల్‌పై కేసు నమోదు చేశామని వివరించారు.