Share News

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:20 PM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర కా ర్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి ధ్వజమెత్తారు. చేసిన అప్పులకు 5 వేల కోట్ల వడ్డీని తమ ప్రభుత్వం చెల్లిస్తుందని, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం రేవం త్‌రెడ్డి అమలు చేస్తున్నార్నారు. మంగళవారం మందమ ర్రిలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మా ట్లాడారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర కా ర్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి ధ్వజమెత్తారు. చేసిన అప్పులకు 5 వేల కోట్ల వడ్డీని తమ ప్రభుత్వం చెల్లిస్తుందని, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం రేవం త్‌రెడ్డి అమలు చేస్తున్నార్నారు. మంగళవారం మందమ ర్రిలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మా ట్లాడారు. ప్రజా సంక్షేమాన్నివిస్మరించి కుటుంబ ప్ర యోజనాలకు పెద్దపీట వేశారని, కుంభకోణాలకు పా ల్పడిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. రాష్ట్రంలో సన్న బియ్యాన్ని అర్హులైన వారికి పంపిణీ చేస్తున్నామన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఇల్లు, రేషన్‌ కా ర్డు ఇవ్వలేదని తెలిపారు. తన నియోజకవర్గంలో డబు ల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేశామని, నూతన రేషన్‌కా ర్డులను పెద్ద సంఖ్యలో పంపిణీ చే శామన్నారు. అంతే కాకుండా కాళేశ్వ రం ప్రాజెక్టు వేస్ట్‌ ప్రాజెక్టు అని తెలి పారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే జిల్లా సస్యశ్యామలం అ య్యేదని తెలిపారు. మాజీ ముఖ్య మంత్రి సొంత నిర్మాణాలతో కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందన్నా రు. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేకుం డా 80 శాతం పంటలు పండుతు న్నాయన్నారు. ఎన్నికల ముందు తా ము ఇచ్చిన హామీలను అమలు చే స్తున్నామని తెలిపారు. గతంలో చె న్నూరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగడాలు మితిమీరిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మంత్రికి సన్మానం

పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం మంత్రి వివేక్‌వెంకటస్వామిని నూరు భా ష సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ము స్లీంమైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన వారు పథకాలకు దరఖాస్తులు చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో సలావుద్దీన్‌, షరీఫ్‌, సుకుర్‌, జమీల్‌, ఇసాక్‌, చోటమియా, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:20 PM