అంగన్‌వాడీ కేంద్రాల్లో కానరాని ఎగ్ బిర్యాని
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:10 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచి చిన్నారులకు పౌష్టికా హారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో ఎగ్ బిర్యాని పథకాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అట్టహాసంగా ప్రారంభించింది. కానీ కొన్ని కేంద్రాల్లో కొ రవడిన సౌకర్యాలు, నిధుల లేమితో ఎగ్ బిర్యాని సొం త ఖర్చులతో భరించలేమని టీచర్లు చేతులెత్తేయడం తో ఎగ్ బిర్యాని పథకం ఒక్కరోజుతోనే ముగిసిపోయాయి.
-నిధుల లేమితో చేతులెత్తేసిన టీచర్లు
-కొన్ని కేంద్రాల్లో కొరవడిన సౌకర్యాలు
కాసిపేట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచి చిన్నారులకు పౌష్టికా హారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో ఎగ్ బిర్యాని పథకాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అట్టహాసంగా ప్రారంభించింది. కానీ కొన్ని కేంద్రాల్లో కొ రవడిన సౌకర్యాలు, నిధుల లేమితో ఎగ్ బిర్యాని సొం త ఖర్చులతో భరించలేమని టీచర్లు చేతులెత్తేయడం తో ఎగ్ బిర్యాని పథకం ఒక్కరోజుతోనే ముగిసిపోయాయి.
అంగన్‌వా డీల పాత్ర క్రీయాశీలకం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర క్రీయాశీలకంగా మారింది. కేంద్రాల బలో పేతానికి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగానే చిన్నారులకు ఏకరూప దుస్తులు, పక్కా భ వనాలకు నిధులు మంజూరు చేస్తూ పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్ర ణాళికలు సిద్ధం చేసింది. పౌష్టికాహార లోపంతో చిన్నా రులు బాధపడకుండా ఉండేందుకు ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు, బాలమృతం పిల్లలకు మధ్యా హ్న భోజనంతో పాటు చిరుతిళ్లను అందిస్తున్నారు. పో షకాహారాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆరోగ్య లక్ష్మీ పథకంలో భాగంగా ఈ ఏడాది జూన్ 11న ఎగ్ బిర్యా ని పథకాన్ని అమలులోకి తెచ్చారు. పథకం అమలులో ఆరంభ శూరత్వం ప్రదర్శించిన అధికారులు అనంతరం పథకాన్ని అమలు చేయడంలో అధికారులు ఆసక్తి చూపడం లేదు.
-ఎగ్ బిర్యాని ఒక్కరోజుతోనే నిలిచిపోయింది
జిల్లాలో మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లం పల్లి నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నా యి. వీటి పరిధిలో 974 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 3,613 మంది గర్భిణులు, 2,760 మంది బాలింతలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 20,335 మంది ఉం డగా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 8,989 మం ది ఉన్నారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రంలో రోజు ఒక పూట గుడ్డుతో కూడిన భోజనం అందిస్తున్నారు. అమ్మ మాట అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమంలో పిల్లలను తల్లిదండ్రులను ఆకర్షించి కేంద్రాల్లోకి పిల్లల ప్రవేశాల ను పెంచేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఎగ్ బిర్యాని పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 11న జిల్లా వ్యాప్తం గా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్‌బిర్యాని తయారు చేసి వచ్చిన అథితులతో పాటు లబ్దిదారులకు అందించారు. కేంద్రంలో ఉండే బియ్యం, ఆహార పదార్ధాలతో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యాని అందించాలని ప్రభుత్వం ఆ దేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం ఎలాంటి అద నపు నిధులు కేటాయించకపోవడంతో ఎగ్ బిర్యాని ప థకం ఆదిలోనే ఆగిపోయింది.
-ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది
పథకాలను ఆర్భాటంగా ప్రకటించే ప్రభుత్వం నిధు లను విడుదల చేయడంలో మొండి చేయి చూపెడు తుంది. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్‌వాడీ కేం ద్రాల్లోని చిన్నారులకు అల్పాహారాన్ని సైతం అందిస్తా మని ప్రభుత్వం తరుపున ప్రకటించారు కానీ ఇది కా ర్యరూపం దాల్చలేదు. అల్పాహారం, ఎగ్ బిర్యాని లాంటి పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం నిధుల విడుద లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంగన్‌వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా గ్యాస్ సిలిం డర్, కూరగాయల బిల్లులు చెల్లించకపోవడంతో ఎగ్ బి ర్యాని చేయడానికి ఖర్చు పెట్టలేక ఆదనపు ఖర్చుగా భావించి టీచర్లు ఈ పథకాన్ని పక్కన పెట్టారు. దీంతో ఎగ్ బిర్యాని ఒక్కరోజుతోనే ముగిసింది.
ఒక్కరోజే అందర్ని పిలిచిండ్రు - అడె పత్తుబాయి, సాముగూడ, కాసిపేట మండలం
ఒక్కరోజు మా గూడెంలోని పిల్లల తల్లులు, బాలిం తలు, చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రానికి పిలిచిండ్రు. కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మళ్లీ పిలవలేదు. మాగూడానికి అంగన్‌వాడీ కేంద్రం లేక చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి వె ళ్లాలంటే పది కిలోమీటర్లదూరం వెళ్లాలి. దీంతో ఎవరు వెళ్లడం లేదు. మా గూడెంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలి.