Share News

కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తా

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:28 PM

ఈ ప్రాంతం అభివృద్ధికి సింగరేణి కొత్త గను లను ఏర్పాటు చేస్తానని దీంతో నిరుద్యోగ యు వతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవీ చేపట్టాక మొదటి సారి ఆయన శనివారం చెన్నూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు ర్యాలీ చేపట్టి మంత్రికి స్వాగతం పలికారు. పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు.

కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తా
చెన్నూరులో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాకు చెక్‌

చెన్నూరులో మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : ఈ ప్రాంతం అభివృద్ధికి సింగరేణి కొత్త గను లను ఏర్పాటు చేస్తానని దీంతో నిరుద్యోగ యు వతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవీ చేపట్టాక మొదటి సారి ఆయన శనివారం చెన్నూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు ర్యాలీ చేపట్టి మంత్రికి స్వాగతం పలికారు. పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి ఈ ప్రాంతానికి ఎనలేని కృషి చేశాడని, ఆ తర్వా త సోదరుడు వినోద్‌, తమ కుటుంబం ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ విజ యం సాధిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తానని దీని ద్వారా ఉపాధి అవకాశాలతో పాటు సింగరేణి డీఎం ఎఫ్‌టీ నిధులతో రోడ్లు, రహదారు ల నిర్మాణం సాగుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతామని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తూ రాష్ట్రంలోనే చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగారిన ప్రయోజనం ఏమి లేదని, తన తండ్రి కాకా వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 1100 కోట్లు మంజూరు చేయించి పనులను ప్రారంభిస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆ స్థలంలో కాకుండా డిజైన్‌ మార్చి కాళేశ్వరం వద్ద నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టుకు సంబంధించిన కాంట్రాక్టర్‌ మెఘా కృష్ణరెడ్డి ఇక్కడ నిధులను అధికంగా పొంద వచ్చని తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి మార్చి కోట్ల రూపాయలు దండుకున్నా రన్నారు. అమృత్‌ ఫల్‌ 02 పథకం కింద తాగునీరు అందించేందుకు రూ. 30 కోట్లు మంజూరు చేయించానని, మరో రూ. 40 కోట్ల నిధులతో గోదావరి నీటిని నియోజకవర్గ ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు. పోడు బూములు సాగు చేసుకుంటున్న రైతుల ను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంఎల్‌సీ పురాణం సతీష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:30 PM