Share News

విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:10 PM

నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలకు శాశ్వ త పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కృషి
పట్టణ శివారులోని శితరాలగుట్టను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌,సెప్టెంబరు 6 (ఆంధజ్యోతి) : నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలకు శాశ్వ త పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. పట్టణంలో 33కేవీ సబ్‌స్టేషన్‌ కోసం శనివారం పట్టణంలోని శి తరాలగుట్ట దగ్గర తహసీల్దార్‌ సైదులు, విద్యు త్‌ ఏఈ ఆంజనేయులు, మునిసిపల్‌ కమిషనర్‌ మురళితో కలిసి ఎమ్మెల్యే స్థలాన్ని పరిశీలించా రు. ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలిసినప్పుడు సబ్‌స్టేషన్‌ మంజూరు చేశా రని తెలిపారు. సబ్‌స్టేషన్‌కు అనువుగా ఉన్న స్థ లాన్ని పరిశీలించి, త్వరలో పనులకు శంకుస్థా పనలు చేస్తామన్నారు. అనంతరం పట్టణంలో ని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ నెల 10న పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో మెగా సర్జికల్‌ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో తారసింగ్‌, ఆ సుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభు, డాక్టర్లు మహేష్‌, బి క్కు, మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీ నివాసులు, నాయకులు పాల్గొన్నారు.

పశువుల పరిశోధన కేంద్రానికి స్థల పరిశీలన

అమ్రాబాద్‌ : నల్లమల ప్రాంతంలోని తూర్పు పొడ జాతి పశువుల పరిశోధన (బ్రీడింగ్‌) కేంద్రం ఏర్పాటు కోసం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ శనివారం అమ్రాబాద్‌ సమీపంలో 913 సర్వే నెంబరులోని 90ఎకరాల కు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న రో డ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మద్దిమ డుగు దేవస్థానం కమిటీ వైస్‌ చైర్మన్‌ అలరాజు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మె ల్యే వంశీకృష్ణ సమక్షంలో బెంచీలను వితరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లింగయ్య, తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌, ట్రాన్స్‌కో ఏడీ ఆం జనేయులు, పంచాయతీరాజ్‌ ఏఈ రుక్మాంగద, అచ్చంపేట మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాసు మల్ల వెంకటయ్య, మద్దిమడుగు దేవస్థాన కమి టీ చైర్మన్‌ రాములునాయక్‌, మండల కాంగ్రెస్‌ ఽఅధ్యక్షులు హరినారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:10 PM