ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:04 PM
ఉపాధ్యాయుల హక్కుల సా ధనకు కృషి చేస్తున్నామని, పీజీ హెచ్‌ఎంల, స్కూల్ అసిస్టెంట్లకు పదో న్నతులు ఇప్పించిన ఘనత తమకే దక్కిందని పీఆర్టీయూ (టిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. నస్పూర్ పట్టణం సీసీసీలో ఆదివారం పీఆర్‌టీయు టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రావుల అధ్యక్షతన జరిగింది.
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి
నస్పూర్, అక్టోంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల హక్కుల సా ధనకు కృషి చేస్తున్నామని, పీజీ హెచ్‌ఎంల, స్కూల్ అసిస్టెంట్లకు పదో న్నతులు ఇప్పించిన ఘనత తమకే దక్కిందని పీఆర్టీయూ (టిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. నస్పూర్ పట్టణం సీసీసీలో ఆదివారం పీఆర్‌టీయు టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రావుల అధ్యక్షతన జరిగింది. ఈ సం దర్భంగా ముఖ్య అథితిగా హాజరైనా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 2004 డీఎస్సీ అభ్యర్థులకు అన్ని రోజుల జీతాలు చెల్లించామన్నారు. గురుకుల టైం టేబుల్ త్వరలో మార్పులు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏల ను కూడా త్వరగా వచ్చే విధంగా చూస్తామన్నారు. జేఏసీ ద్వారా ఎంప్లా యిమెంట్ హెల్త్ స్కీం తొందరగానే ఉపాధ్యాయులందరికీ అమలు అ య్యే విధంగా చూస్తామన్నారు. అనంతరం జిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన 77 మంది పీజి హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయు లను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, రాష్ట్ర అసోసియేట్ సభ్యులు ప్రసాద్, కుమార స్వామి, నాయ కులు మంగ మహేందర్‌రెడ్డి, సాంబమూర్తి, సత్యనారాయణ, రమణారెడ్డి, లతో వివిధ మండలాలకు చెందిన అధ్యక్షకార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.